తిరుమలలో కిక్కిరిసిన భక్తుల రద్దీ

తిరుపతి, జూలై 14 (జనంసాక్షి) : తిరుమలలో ఈ రోజు కొండపైకి వెళ్లే కాలిబాట మార్గం కిక్కిరిసింది.రెండవ శనివారం ఆదివారం సెలవులు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలిపిరి లగేజి కౌంటర్‌ వద్ద బారులు తీరారు. లగేజిని భద్రపరిచేందుకు గంటసేపు సమయం పడుతుంది.కాలిబాట మార్గంలో కొండకు బయలుదేరిన భక్తుల గోవింద నామస్మరణతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.