తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ఈరోజు ముగియనున్నాయి. బుధవారం నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తున్నట్లు తితిదే అధికారులు తెలియజేశారు