తులసీ ప్రజాపతి నకిలీ ఎదురుకాల్పుల కేసుకు సీబీఐ ఛార్జిషీట్‌ దాకలు

అహ్మదాబాద్‌: తులసీ ప్రజాపతి నకిలీ ఎదురుకాల్పుల కేసుకు (2006) సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారమిక్కడి ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జీషీట్‌ దాఖలు చేసింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సన్నిహితుడు, మాజీ హోం మంత్రి అమిత్‌షా సహా మొత్తం 19 మంది పేర్లను అందులో చేర్చింది. ఈ ఛార్జీ షీట్‌ను అనుమతించిన అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఏవై దవే తదుపరి విచారణను వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేశారు.