తూర్పుగోదావరి జిల్లాలో రేపు సీఎం పర్యటన

కాకినాడ: జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటించనున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలియజేశారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు ఆయన వివరించారు. 395 పక్కా ఇళ్లు, 400 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 1.30 లక్షల హెక్టార్లలోని పంట పొలాలు ఇప్పటికీ  నీటిలో నానుతున్నాయన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో వరద ప్రభావం ఉన్నట్లు ఆయన తెలియజేశారు.