తృటిలో తప్పిన ప్రమాదం – ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వైనం

బసంత్‌నగర్‌, మే 27, (జనంసాక్షి)
రామగుండం మండలం పుట్నూరు గ్రామ బస్టాండ్‌ వద్ద ఆదివారం భారీ వాహనం అదుపు తప్పి విద్యుత్‌ స్తంభంపై అతిసమీపానికి వచ్చి ఆగిపోవడంతో, తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలు… జీపీఎల్‌ నాలుగులైన్ల రహదారికి సంబంధించిన ఈ వాహనం రోడ్డు పనుల నిమి త్తం జయ్యారం స్టోన్‌ క్రషర్‌ నుంచి రాజీవ్‌ రహదారి వైపుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై మట్టికుప్పలు ండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా, ఉదయం 8 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో భారీ వాహనాన్ని సాయంత్రం 4గంటలకు తీయడంతో ఈరోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులకు, వాహనచోదకులకు ఇబ్బందులు తల్తెత్తాయి.