తెదేపా లేఖ గురించి తెలియదనడం అవివేకం: యనమల

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు విషయమై తెదేపా రాసిన లేఖ గురించి తనకు తెలియదనడం కేంద్రమంత్రి షిండే అవివేకమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గత సెప్టెంబరులోనే తెలంగాణ పై స్పష్టమైన వైకరితో తెలుగుదేశం ప్రధానికి లేఖ రాసిందని ఆయన చెప్పారు. ఈ లేఖ అందినట్లు ప్రధాని సంతకంతో తమకు మరో లేక అందిందని యనమల చెప్పారు. ప్రధాని వేరు, కేంద్రప్రభుత్వ వేరు అన్నట్లు షిండే మాట్లాడడం అయనకున్న అవగాహనారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. మూడు ప్రాంతాల నాయకుల ఏకాభిప్రాయంతో తెలంగాణపై తీసుకున్న నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉందని యనమల చెప్పారు.