తెదేపా విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

వీర్లపల్లి: తెదేపా విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన వీర్లపల్లి శిబిరంలో నేతలు సమావేశమయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడికి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీలో భర్తీ చేయడం సాథ్యం కాదన్నారు. చివరి నిమిషం వరకు పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడమే తన సిద్థాంతంగా ఆయన పెట్టుకున్నారని చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు,