తెరాస రాష్ట్ర కమిటీ భేటీ, పల్లెబాట వాయిదా

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై అసెంబ్లీ సమావేశాల కారణంగా తెరాస రాష్ట్ర కమిటీ భేటీ, పల్లెబాట కార్యక్రమాలు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 30న రాష్ట్ర కమిటీ భేటీ, డిసెంబర్‌ 5 నుంచి పల్లెబాట కార్యక్రమాలు నిర్వహిస్తామని నేతలు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలియజేశారు.