తెలంగాణకు అనుకూలమని చెప్పాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలమని చెప్పాలని తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యులు హరీష్‌రావు అన్నారు. అఖిలపక్షం డిమాండ్‌ చేసిన పార్టీలు తమ విధానాలు మార్చుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్‌ విజయమ్మ స్వయంగా అఖిలపక్ష సమావేశానికి హాజరై తెలంగాణకు అనుకూలమని చెప్పాలని డిమాండ్‌ చేశారు.