‘ తెలంగాణకు మాదిగలంతా అనుకూలం’

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న మాదిగలంతా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని టీఆర్‌ఎస్‌ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సామెల్‌ అన్నారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని మాదిగలంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఎమ్మార్పీఎస్‌  నేత మందకృష్ణ మాదిగకు తమ అధినేత కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని హెచ్చరించారు.