తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించడంలో రాజ్యంగ ఆమోదం ఉంది!

మత ప్రతిపదికన రిజర్వేషన్‌ అడగడం సరైంది కాదనే వాళ్లున్నారు. ముస్లింల హక్కుల గు రించి మాట్లాడడం సంకుచితత్వమంటారు. అ లాంటివారిలోని కొందరు మాత్రం తాము అన్ని రాయితీలు, ముఖ్యంగా రిజర్వేషన్లు పోందుతుం టారు. వారు రాజ్యంగా నిర్మాణ సమయంలో, అంతకు ముందు ముస్లింల రిజర్వేషన్‌ వివరాలు తెలుసుకోవాలి. ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పిం చడంలో రాజ్యంగ ఆమోదం ఉందన్నదీ తెలుసు కోవాలి.

క బ్రిటిష్‌ పాలనలో 1925 నుంచి మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండేవి. అప్ప ట్లొ మైనారిటీలంటే  ముస్లింలు,క్రైస్తవులు, సిక్కులే కాదు, దళితులు ఆదివాసులు కూడా! 1934 నుంచి ముస్లింలకు 25 శాతం రిజర్వేషన్‌ ,ఇతర మైనారిటీలకు 8.5 శాతం రిజర్వేషన్‌ ఉండేది. 1932 తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్ని మైనారిటీ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిం చారు. మౌనారిటీల హక్కుల గురించి సూచనలి వ్వడం కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌ సబ్‌ కమిటీ 1947 జూలై 27 న సమర్పించిన నివేదికలో ముస్లింలకు , సిక్కులకు, క్రైస్తవులకు, దళితులకు, ఆదివాసులకు రాజకీయ రిజర్వేషన్ల తో సహా అన్ని రకాల రిజర్వేషన్లు ఇవ్వాలని సూ చించింది. దేశ విభజనను ఆసరాగా తీసుకొని పై ప్రతిపాదనను 1949 మే 11 న రాజ్యాంగా పరిషత్‌ సలహా కమిటీ తిరస్కరించింది. అట్లా అప్పటి కాంగ్రెస్‌ నాయకులు దీన్ని ఆమొదించి ముస్లింలకు అన్యాయం చేశారు.

క ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రతినిధ్యం లేని వెనుకబడిన తరగతులకు చెందిన  పౌరులకు రిజర్వేషన్‌ కల్పించే రాజ్యంగంలోని నిబంధన 16 ఇప్పుడున్న స్థితిలోకి రావడానికి ముందు, ఈ నిబంధన మైనారిటీ మతాలకు చెందిన పౌరుల ప్రయోజనార్థం రూపోందింది. పిదప చర్చల్లో మైనారిటీ మతాలకు చెందిన పౌరులతో పాటుగా మెజారిటీ కమ్యూనిటీలోని వెనుకబడిన తరగతు లవారిని కూడా కలుపుకునే ఉద్దేశ్యంతో ఈ నిబంధనలో మొదట ఉండిన మైనారిటీ పదం స్థానంలో బ్యాక్‌వర్డు క్లాసెస్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ అనే ప దబంధాన్ని పోందుపరచడం జరిగింది. చివరికి ఈ నిబంధనకేవలం బీసీలకే పరిమితమైపోయి ముస్లింలకు అన్యాయం జరుగతూ వస్తున్నది.

క నిబంధన 15 సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులకు ప్రత్యేక సదుపాయాలు కలుగజేసే అధికారాన్ని రాజ్యాదికారాన్ని రాజ్యనికిచ్చింది. దీని పరిధిలోకి ముస్లింలు కూడా వస్తారు. అంతేగాక నిబంధన 29 ప్రస్తావించే విషయాలలో మతం, బాషా కూ డా ఉన్నాయి. ఈ రెండ9ఱఉ నిబందధనలను కలిపి చూస్తే ఒక మైనారిటీ మత కమ్యూనిటీగా ముస్లింలు ప్రత్యేక సదుపాయాలు పోందడానికి అర్హులే. మండల్‌ కమీషన్‌ కేసు తీర్పు సమయం లో సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ దేశంలో ముస్లింల దుస్థితి

కన్నడ రచయిత బోళువారు మహమ్మద్‌ కుం జి కథల సంకలనం ‘దేవరంగళ రాజ్యదల్లి’ ముం దుమాట ఇది. మహమ్మద్‌ కంజి మొదటి కథల పుస్తకం అత్త యిత్తగళ సుత్తుముత్తు. ఎన్నో సంచ లనాలకు అతను పెట్టింది పేరు…

ఈ దేశంలోని ముస్లింలు కడు పేదవాళ్లు. అంతేకాదు వాళ్లు అత్యంత అవమానితులు. హరి జనుల్లాగే ముస్లింలు కూడా మన దేశంలో రెండో శ్రేణి గౌరవానికి నోచుకున్న ప్రజాసమూహం. హరిజనులకన్నా మిక్కిలి నిరుపేదలు, నిరక్షరా స్యులు పెద్ద సంఖ్యలో సామాజికంగా వెనకబడిన వాళ్లు వున్నది కూడా ముస్లింలలోనే.! దేశ జనా భాలో సమారు పన్నెండు శాతం కూడా దక్కడం లేదు. ఈ అన్యాయం చాలదన్నట్లు మన దేశంలో ఒకచోట కాకపోతే మరోచోట అత్యంత క్షుద్ర కార ణాల కోరకు ముస్లింల మీద పూర్వనిర్ధారితమైన పకడ్బంది దాడులు జరుగుతూనే ఉన్నాయి. సువ్య వస్థితంగా నడుస్తోన్న ఈ దాడుల్లో ముస్లిం సోద రుల ఇళ్లు, ఆస్తిపాస్తులూ, దుకాణాలు వినాశనా నికి గురవుతున్నాయి. పైగా పెద్ద సంఖ్యలో ము స్లింలను వాళ్లు ముస్లింలనే ఒకే ఒక్క కారణంతో హతమారుస్తున్నారు. ఈ దాడులన్నింటి లోనూ పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం , ఆస్తి నష్టాలకు గుర వుతున్నావాళ్లు మస్లింలు. కాని ఈ దాడుల్లో అరెస్ట్‌ అవుతున్నవాళ్లలో కూడా ముస్లింలదే పెద్ద సంఖ్య. అనేక సందర్భాలలో బహుశ సంఖ్యాక వర్గాల నేరస్థులకు ఏ శిక్షా పడడం లేదు. అంత మాత్రమే కాదు. వాళ్లు కోంతమంది దృష్టిలో అఖండ దేశబ క్తులుగా మారిపోతున్నారు. ఈ అధికార యం త్రాంగంలో చాలామంది బహుశ సంఖ్యాకవార్గల వాళ్లవడం చేత వీళ్లు ఈ దాడుల్లో పాల్గోనే గూం డాల అత్యాచారాలకు సహాయ సహాకారాలు అం దిస్తున్నారు. లేదా చూసీచూడనట్లు మిన్నకుండి పోతున్నారు.

అత్యధిక సర్కుల్యేషణ్‌ కల్గిన మన జనప్రియ లాంటి పత్రికలన్నీ హిందూ ముస్లింల మత కల హాల గురించి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. లేదూ ఏ విషయాన్ని చెప్పకుండా మొహం చాటే స్తున్నాయి. ముస్లింల సామాజిక వెనుకబాటుతనం గురించి కూడా ఆ పత్రికలు విపరీత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందువల్ల కేవలం ఈ మోస్తరు పత్రికల నిత్య పారాయణంతో తమ మనసాక్షి నిత్యం ప్రతిష్ట చేసుకుంటోన్న మనదేశంలోని విద్యావంతులైన ఉదారవాదులు, ఈ దేశంలో ము స్లింలపై నడుస్తోన్న దాడులు, దొమ్మీలు, అత్యాచా రాలు, దోపిడీల గురించి కళ్లుండీ చూడలేని కబొ దునిలవుతున్నారు. ముస్లింల మీద జరిగే దాడుల న్నింటినీ మన పత్రికలు రెండు మతాలు తేదా వ ర్గాల మధ్య జరిగే సంఘర్షణ, అని వర్ణిస్తున్నాయి  ముస్లిం అల్ప  సంఖ్యాకుల మీద జరిగే అధిక సం ఖ్యాక మతస్థుల దాడి, రెండు సమవుజ్జీ బలాలు కల్గిన గుంపుల మధ్య జరిగే అన్నట్లుగానే చిత్రీకరి స్తున్నాయి. మన ఉదారవాదాల అంతరాత్మలు ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఇది చాలు.

కానీ ఈ దాడుల వెనక వున్న అధిక సంఖ్యా కుల నరమేధ ఫాస్టు రాజకీయాలకిది చాలదు. ఈ రాజకీయ ప్రచార యంత్రంగం, మతకలహాల పేరుతో ముస్లింల మీద జరిగే దాడులకు మతపర మైన చారిత్రకమైన సాక్ష్యాల్ని చూపుతోంది. ఈ ప్ర చార యంత్రాంగానికి  మధ్యయుగాల నాటి ము స్లిం రాజులపారిపాలన, ఇదే ముస్లిం ప్రజాసమూ హాల సార్వకాలిక కార్యానికి సాక్ష్యంగా మారుతోం ది. విద్య, సామాజిక వెనకబాటు తనాలతో ము స్లింలలో వేళ్లూనుకోని ఉన్న రిజిడిటి, మూఢాచా రాలను కుట్రలుగా ఈ రాజకీయ ప్రచార సాధ నాలే ఎత్తి చూపుతున్నాయి. అదికారం, హోదాల కోసం జరిగిన యుద్దాలు, రక్తపాతాలు ఆనాటి వలసవాద రాజకీయ లక్షణాలైనప్పటికీ… మన చరిత్రలోని ముస్లిం రాజుల దండయాత్రల పర్యవ సానంగా వాళ్లు ద్వంసం చేసిన గుళ్లూ, రోపురశ్రీ నాల బాధ్యతని ఈ దేశ ముస్లింల అనివార్య పర్య వసానమైన దేశ విభజన తాలూకు యావత్తూ జవాబుదారీని మస్లింల పైన పట్టెడన్నానికి ఆసరా అయిన ఈ మట్టిని పోగోట్టుకోవడం, అమాయకు లు బలి కావడం మన విద్యావంతులకు కూడా సీరియస్‌ సమస్యగా కన్పించడం లేదు. అది ము స్లింలు చేసిన అపరాధానికి వాళ్లనుభవించాల్సిన శిక్ష అని ఆలోచించడం వాళ్లకి అలవాటైపోయింది  ఈ దేశంలో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, అన్నా దమ్ములు, అక్కాచెల్లెళ్లతో రక్తసంబందాలు రక్త మాంసాలు, చీమూనెత్తురు కల్గిన మనుష్యులు.. .వాళ్లూ ముస్లింలవుతే, మన మట్టుకు మాత్రం వా ళ్లు ప్రాణంతోతిరిగాడుతోన్నవ్యక్తులు కాదు. వాళ్లు సామూహిక పాపానికీ, అపరాధానికి సంకేతాలు. చారిత్రక తప్పిదంగా అర్థం చేసుకోబడుతున్న చారిత్రక ప్రతీకలు.

ఈ కారణం చేత మన దేశంలో మత కల హాల పేరుతో ముస్లింల మీద జరిగే దాడుల్లో మ న నగరాల్లోని అధిక సంఖ్యాకవర్గాల్లో సగానికిస గం చదువుకున్నవాళ్లు మాత్రమే క్రియాశీలక పాత్ర పోసిస్తున్నారు. ముస్లింల గురించి తిరస్కార భావం, ద్వేషం, అనుమానాలు, దురాబిప్రాయాలు వెరసి మన నగరాల్లోని హాఫ్‌ నాలెడ్జ్‌ మనుషుల మెదళ్లలో తిష్ట వేసుకొన్నాయి. మన పల్లెల్లోనూ పెద్ద మొత్తంలో ముస్లింలున్నా ఈ ద్వేషపిశాచం పల్లెలకు ఇంకా సోకలేదు. పైగా ఈ దేశంలో ముస్లింలకు 800 సంవత్సరాల చరిత్ర వున్నా హిందూ ముస్లింల మధ్య ఈ మత కలహాలు ఈ శతాబ్దిలో మాత్రమే కనిపిస్తాయి.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…