తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

మన పూర్వ నిర్ధారిత దృష్టికి ముస్లింలలో కన్పించే అనేక ఆచారాలు హిందువుల్లోనూ ఉన్నా యి. అనే సత్యం అసలు పట్టదు. ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే తమ జీవన విధానంలోనూ, తమ దైనందిన కార్యకలాపాల్లోనూ హిందూ సం స్కారాలను వదిలివేసిన మధ్యతరగతి విద్యావం తులైన మన హిందువులు మన గతచరిత్ర గురిం చి ఆలోచిస్తున్నాప్పుడు మాత్రం పక్కా హిందువు లైపోతారు.అంతేకాదు తమ మతంలోనే అధిక సంఖ్యాకులు యింకా అందిపుచ్చుకోలేని స్త్రీ స్వా తంత్య్రం, విద్య, శాస్త్రీయ దృక్పతం, మత సామ రస్యం…ఇలాంటి విలువలు ముస్లింల ఎకాకి కల్గి ఉండాలని కోరుకునేవారు. వెనుకబాటుతనంతో కాదట, పైగా అది ఉద్దేశ్యపూర్వకమైన లోపల్లోపల వాళ్లంతా కలిసికట్టుగా కుట్రకి బలై, కడకు మాన వీయ స్పర్శ, అనుకువ, సోదరభావాలను కోల్పో తున్న ఒకానోక జాతి   దురంతమిది. నేను అత్యు క్తులు చెప్పడం లేదు. ఊహాపోహాలు రారయడం లేదు. అలంకారిక పరిబాష ఉపయోగించడం లేదు. నాజీ జర్మనీలో జరిగిన జాతి హత్య తాలూ కు అంచనా వున్నవాళ్లకి మన దేశానికి స్వాతం త్య్రం లభించిన  సందర్బలలో తూర్ఫు పాకిస్థాన్‌, పంజాబులో జరిగిన మత పరమైన హింసా స్మృ తులు యింకా చెరిగిపోని వాళ్లకి ఇది తప్పక అర్థమవుతుంది. ఈ దేశంలో ముస్లింలను పాపం, క్రూరత్వం, ద్రోహాల సంకేతాలుగా పరిగణించే ఆటవికతకు విరుద్దంగా గొంతెత్తవలసిన సమయ మిది. ముస్లింలను పాక్‌ ఏజెంట్లు అనో, హిందూ మందరాల్ని, హిందూ స్త్రీలని అపవిత్రం చేయా లని కోరుకునే నీచులనో లేదూ మున్ముందు ఎప్పుడో ఓనాడు ఈ దేశాన్నంతా తమ మతస్థుల తోనే  నింపడానికి ఇప్పట్నించే నాలుగైదు పెళ్లిల్లు చేసుకుని యుద్ధప్రతిపాదిక మీద పిల్లల్ని పుట్టించే పురుష పుంగవులనో ఆలోచించడం ముమ్మాటికీ తప్పు పాపం, ద్రోహం తాలుకు ప్రతీకలుగా మిగి లిపోయిన ముస్లిం సోదరులు సైతం మనకిమల్లే మన కళ్లముందు మన మట్టి మీదే మసలుతున్న సజీవమూర్తులు.చారిత్రకతప్పిదాన్ని తరతరాలుగా మోస్తోన్న ఈ ప్రజాసమూహం కూడా రోజువా రి బతుకు తిప్పలతో సతమతమవుతోంది. మనలాగే అజ్ఞానం మూడ విశ్వాసాలు, ఆస్తపాస్తులు, ఇళ్లు , ఆడపిల్లల పెళ్ళిల్లు ఉద్యోగం, కుటుంబ గౌరవం మొదలైన వాటితో ఈ సోదరులు సైతం బతుకు పోరాటం చేస్తున్న వాళ్లు అని మనం మరువ రాదు.

పోతే..ముస్లింలు దళితుల కన్న భిన్నమాన వాళ్లు అని కూడా నాకనిపించలేదు. హరిజనులు అత్యంత దోపిడీకి గురయిన వాళ్లనీ, అవమానితు లనీ, నిరు పేదలనీ మన విద్యావంతుల్లోని చాల మంది లిబరల్‌ మేధావులు అంగీకరిస్తారను. కానీ ముస్లింల మీద జరిగే దాడి అఘాయిత్యాల గురిం చి వీళ్లంతా కళ్లున్న కబోధులు. ముస్లింలకు న్యా యబద్ధంగా దక్కాల్సిన అవకాశాల్ని నిరాకరిస్తోన్న అధిక సంఖ్యాకవర్గాల ద్వేషం, అత్యాచారం, దు ష్ప్రచారాల గురించి కూడా మన మేధావులేవరు, ఏమాత్రం పట్టించుకోరు. ప్రజల మనస్సుల్లో లేని పోని అనుమానాల్ని , భయల్ని  గాల్పే అభిప్రాయా న్ని కల్గించి వాళ్లను గుడ్డి ద్వేషానికి బటిపశువులు గా మార్చే ఈ ఫాసిస్టు శక్తులకు మన మేధావుల తమ నిర్లిప్తత నిరాసక్తతతో మౌనంగా సహాయ సహాకారాలు అందిస్తున్నారు. ఇలాంటి సన్నివేశం లో ముస్లింలు సహజంగానే ఆత్మ రక్షణ కోసం తమ మతస్తులైన మతాంధులు, మత గురువులు, అవకాశావద రాజకీయమ్మన్యులు మొదలైన నాయకుల్ని ఆశ్రయించవలసి వస్తోంది. ఈ దేశ ముస్లింలు ఇవాళ ఎలాంటి దయనీయ స్థితిలో వున్నారంటే వాళ్లను నాశనం చేస్తున్నావాళ్లే వాళ్ల రక్షకులైపోతున్నారు.

ఈ వికట వికృత సన్నివేశంలో  మనమంతా ఏకమై ముస్లింలనున పాపపు సంకేతాలుగా పరి గనిస్తోన్న హిందు మతాందులు క్రూరత్వాన్ని వ్యతి రేకించాలి. ముస్లిం మతాంధులైన పైగా ఇలా ప్రతిఘటిస్తునే ఆవిద్య, కటిక పేదరికాలు అసలు మూలాల్ని వెదకాలి . మతగురువులు, మత ఛాం దసవాదులు, అవకాశవాద రాజకీయమాన్యులు, విళ్లలో ఎవరూక కాని మూర్ఖులు…ఈ దేశంలో ద్వేషం ఎగజల్లుతున్నారు. వీటిని  పకడ్బందీగా ఎదుర్కోగల్గిన సాహిత్యం శక్తిమంతంగా రూపుది ద్దుకోవాల్సిన అవసరం వుంది. భవిష్యత్తు గురించి అశావహంగా ఉండడం కూడా మనందరి కర్తవ్యం

– జి రాజేందర్‌

జాతి అణచివేతను ప్రశ్నిస్తున్న సంకలనం

భారత్‌లోనైనా ప్రపంచంలోనైనా ఈ వైవి ధ్యాన్ని ధ్వంసం  చేస్తున్న సందర్బంలో  అజాం వ చ్చింది. అజాం అనేది ఆర్తి కాదు, పిలుపు కాదు, ధ్వంస  రచనలో నిట్ట నిలువుగా మునుగుతున్న వాళ్ల ఆర్తనాదం, నిస్సహాయ  ఆక్రోషం, గాయం నుంచి కారే కన్నీళ్లు, గాయం నుంచి, అమెరికా చేసిన గాయం నుంచి ముస్లింల ఒంటిరితనమే విశాలంగా పరుచుకోన్న కవిత్వమిది. ప్రయత్నపూ ర్వకంగా చెప్పింది కాదు కవిత్వం వాళ్ల సహజ భాష  అన్నట్లుగా ఉంటుంది. ఏదో సందర్భంలో ఎక్బాల్‌ అనే మిత్రుడిని కవిత కావాలన్న  నాకేం కవిత్వ మొస్తది? అన్నాడు అట్లా అనలే నా తోట లో పూలే లేవు, నన్ను పువ్వడిగితే ఎల్లా తెచ్చిచ్చేది, అన్నాడు ఉర్దూలో కవిత్వం రాదంటూనే కవిత్వం మాట్లాడాడు. అలా అంతా కవిత్వమే ఇది సైగల్‌ గొంతులోని మెలాంకలీ ఇది.

సోవియట్‌ రష్యా ఉన్నప్పుడు ప్రపంచం బొ మ్మ, బోరుసు ఉన్న నాణెం. బొమ్మపోయింది, బొ మ్మ ఉండోద్దు, బోమ్మ ఉంటే దానకికి చీమూ  రక్తం ఉంటాయి. అది ప్రశ్నిస్తుంది. ప్రతిఘటి స్తుంది. ప్రపంచంలో కమ్యూనిజం ఓడిం తర్వాత మరో మరో బోమ్మ ఇస్లాం మిగిలే ఉంది. అదీ పో వాలి. ఇప్పుడు ఇస్లాం ప్రాణమున్న వైవిధ్యమున్న బొమ్మ బొమ్మలుండోద్దు, బోరుసొక్కటే  ఉండాలి. ప్రపంచమైనా భారత్‌ అయినా! అందూ నిద్ర పో వాలి. డాలర్‌ డెక్కల కింద, కాషాయం కరవాలాల కింద నిద్రపోవాలి. అజాలుండొద్దు, అల్‌ఖైదాలుం డొద్దు, అరాఫత్‌లుండొద్దు! నిర్ధిష్ట భౌగోళిక ప్రాం తంలో నివసించే ప్రత్యేక సంస్కృతి, బాష, మతం, ఆచార వ్యవహారాలు కలిగివున్న మొత్తం ప్రజా సమూహం జాతి అనే సాప్రదాయిక నిర్వచనాన్ని పక్కన బెట్టి, ఆ ప్రజా సమూహంలోని ప్రత్యేకత కలిగిన ఒక భాగాన్ని కూడా జాతిగా పరిగనిస్తు న్నారు. ఈ రెండు అర్ధాల ప్రకారం ఒక జాతి అయిన ముస్లిం జాతిని, బయట అమెరికా, దాని అనుంగు దేశాలు కానీ, లోపల మెజారిటీ మతం కానీ ఎందుకు నిర్మూలించాలనుకుంటున్నాయి? నిజంగా మొత్తం జాతిని నిర్మూలించడం వాటి ఉద్దేశమా? కాదు సోకాల్డు ప్రధాన స్రవంతి ధ్వం సం చేయడమనేది సమాదానం.గమనిస్తే భారత  మెజారిటీ మతం ముస్లింలను కూడా కలుపుకొని పాశ్చాత్య ప్రపంచం ఇస్లాంను  కూడా కలుపుకొని పాశ్యాత్య ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలి.

1965 నుంచి ముఖ్యంగా కమ్యూనిజం ఓడింతర్వాత పాశ్చాత్య ప్రపంచం ఇస్లాంను కొత్త శత్రువుగా భావించింది. తను, అనేక సంక్షోబాల నించి బయట పడడానికి, తన ఆధిపత్యాన్ని విస్తరించడానికి ఇస్లాంను శత్రువుగా చూపించే ప్రయత్నం చేసింది పాశ్చాత్య ప్రపంచం. ఇరాక్‌ మీద చేసిన రెండు దాడులు, అఫ్ఘన్‌ మీద చేసిన దాడి, ఇజ్రాయిల్‌ దురాగతాలు దానిక నిదర్శ నాలు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇస్లాం ఆధు నిక నాగరికతకు శత్రువనీ, ప్రమాదకరమనీ నమ్మించ జూసింది. హంటింగ్‌టన్‌ నాగరికతల సంఘర్షణ దానికి సైద్దాంతిక సమర్థన. సరిగ్గ భా రత్‌లో కూడా గాంధేయ సోషలిజం గురించి వల్లె వేసిన హిందూత్వ ఛాందసవాదులు, కమ్యూనిజం వెనుకపట్ల పట్టింతర్వాత ఆ నినాదం వదిలేసి, స్వార్థ ప్రయోజనానికి ఇస్లాంను లక్ష్యంగా ఎంచు కుంది. దానికి బాబ్రి ధ్యంసం, గుజరాత్‌ సంఘట నలు పరాకాష్ట దానికి సుదర్శనంలాంటి ఆర్‌ఎస్సే స్‌ నాయకుల రాతలు సైద్దాంతిక సమర్థన. వీటి ఫలితంగానే జాతీయంగానూ అంతర్జాతీయం గానూ ఇస్లాం ఛాందసవాదం టెర్రరిజం రూపం తీసుకుంది.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…