తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

బోనాల పండగలో దేవతకు బోనాలను సమ ర్పించి ఇంటికి వచ్చేముందు బోనాల నెత్తుకున్న వారి కాళ్లపైన నీళ్లు పోస్తారు. అలాగే పీర్లనెత్తుకో ని ఇంటి ముందుకోచ్చిన వారి కాళ్లపైన నీళ్లు పో స్తారు. పీర్లకు కొబ్బరికాయ కొడతారు, పూలదండ లు వేస్తారు. ఈ ఆచారాలన్నీ తెలుగువారివే.తమ ఆచారాలను పీర్ల పండగకన్వయించి.ఆ పండగ ను తమదిగా చేసుకున్నారు.ముస్లింలు మాతమ్‌ చేసుకూంటు ఏడుస్తూ హుసేన్‌ జీవితాన్ని పాట లుగా పాడుతూ విషాదంలో పీర్లను ఊరేగిస్తారు. పల్లెల్లోని తెలుగోళ్లు మాత్రం పీర్ల ఊరేగింపును వాద్యాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదబా రితంగా జరుపుతారు. కొండముచ్చు, పులి, ఎలుగుబంటి లాంటి జంతువుల వేషాలు వేసు కుంటారు. అంతేకాకుండా ఎలుగుబంటిని ఆడిం చే ఫకీరు, ఎరుకల, కురుమ, గౌడ లాంటి వేషాల ను వేసుకొని ప్రజలను వినోద పరుస్తారు. చిన్న  పిల్లలను సంతోషపుస్తారు. ప్రేక్షకులిచ్చే డబ్బులతో విందులు చేసుకుంటారు. ఈ విచిత్ర వేష ధారణ లు గ్రామ దేవతల ఉత్సవాల సమయంలో పల్లెల్లో కనిపిస్తాయి. పల్లెల్లో పీర్ల పండగను కూడా గ్రామ దేవతల పండగల్లో ఒక పండగగా మార్చివేశారు. గ్రామ దేవతల ఊరేగింపులో పూనకాలు రావడం సర్వసాధారణం. పీర్ల ఊరేగింపులో కూడా పీర్లనె త్తుకున్న తెలుగ్లోకు పూనకం వస్తుంది. ఓక్కోసారి వారు పూనకంలో ఊర్దూ, అరాబిక్‌ బాషలను కూ డా మాట్లాడుతుంటారు వారిని కష్టాల్లో ఉన్నవా రు వారి భాదనివారణోపాయాలను గూర్చి అడుగు తారు. భావిష్యత్తు గూర్చి ప్రశ్నిస్తారు. వారికంద రీకి జవాబులు చెప్పూతూనే పీర్లకు మొక్కిన మొక్కులను చెల్లించుకుని సంతోషిస్తుంటారు. ఈ దృశ్యాలన్ని గ్రామ దేవతల ఊరేగింపుల్లో మనకు కన్పించేవే. రాయలసీమ ప్రాంతంలో దీన్‌ గోవిం దా, దీన్‌ గోవిందా అని నినాదాలు చేస్తారు. అనం తపురం జిల్లా గూడూరులో కుళ్లాయి స్వామి పీర్ల చావిడి, అంజనేయస్వామి గుడి రెండూ కలిసే ఉంటాయి. రెండింటిలో ఒకేసారి పూజలు జరప డం అక్కడి తెలుగోల్ల ముస్లింల సమైక్యతకోక నిద ర్శనం.

ఊరేగింపులో కాకుండా ‘అలావా’ నిప్పులగుం డం తోక్కేటప్పుడు కూడా పీర్లను పట్టుకున్నవారికి పూనకం వస్తుంది. శరీరాలకు గాయాలైతే, పాదా  లు కందిపోతే ‘ఊద్‌’ ను విభుతిగా పెడ్తారు.గ్రామ దేవతల్లో ఎక్కువమంది స్త్రీలే. అందుకే గ్రామాల్లో ని తెలుగోల్లు బీబీఫాతిమాకు ముస్లింలు కూడా ఇ వ్వని ప్రాదాన్యాన్ని ఇస్తారు. తెలంగాణ ప్రాంతం లో బీబీ ఫాతిమాకు పీరుకు ఒడిబియ్యం పోస్తారు. అనంతపురం జిల్లాలో ఫాతిమా పీరును 100 కీ లోల పూలతో అలంకరిస్తారు. ఊరేగింపులో స్త్రీలు తడిబట్టలతో కింద పడుకోంటారు. వారి మీద నుండి ఫాతిమా పీరు పోతే మంచి జరుగుతుం దని నమ్ముతారు. పాటల్లో కూడా బీబీ ఫాతిమానే ప్రధాన పాత్రగా తీసుకోని పాడుతుంటారు. కథ లను చెప్పుకుంటారు. పల్లీయులకు స్త్రీలపై నుండే అభిమానాలే వారి సాహిత్యంలో ధర్శనమిస్తుంటా యి. అందకే వాల్మీకి రామాయణంలో నిర్లక్ష్యం చేయబడ్డ ఊర్మిలాను, శాంతాదేవికి పల్లె స్త్రీలు తమ పాటల్లో పెద్ద పీట వేశారు. పల్లెల్లో గ్రామదే వతల పండుగల్లో బలి ఇవ్వడం ముఖ్యమైన ఆచా రం. ఈ ఆచారాన్నే తెలుగోల్లు పీర్ల పండగలో కూడా ప్రవేశపెట్టారు. పీర్ల పండగ చివరి రోజు పీర్లను పెట్టెలో పెట్టెముందు హలాల్‌ చేసి గొర్రెల ను కాని మేకను కాని బలిగా ఇస్తారు. ఆ మాంసా న్ని ౖ’అల్వకాడి బొట్టు’ అంటూ పల్లెలోని ప్రతీ ఇం టికి పంపిస్తారు. తెలంగాణలో దసరా పండుగకు బలి ఇచ్చిన జంతువు మాంసాన్ని దసరా బోట్టు అ ని ప్రతీ ఇంటికి పంపుతారు.

పీర్ల పండుగలోని ఆచారాలనే కాకుండా పాటలను కూడా తెలుగోల్లు తమకు అనుకూలం గా మార్చుకున్నారు. తమ దేవతల వర ప్రసాదాలే పీర్ల దేవుళ్లని, పీర్ల దేవతలనీ గానం చేస్తూంటా రు.తమ కులాల్లోని ఆచార సంప్రధాయాలనే పీర్ల దేవుళ్లకు కూడా అన్వయిస్తారు. పీర్ల పండగ పాట లను గమనిస్తే తెలుగోల్లు పీర్ల పండగను తమ కుల సంప్రదాయాలకు, పౌరాణిక గాథలకు అన్వ యించుకున్న విదం అర్థమవుతుంది.బీబీ ఫాతీమా కు సంతానం కలగకపోతే పౌరాణిక గాధల్లో బా  గా తపస్సు చేస్తుంది.బీబీ ఫాతీమా శంకరునికి నమస్కరించి మగ సంతానం కవాలని కోరుతుం ది. నీకు కొడుకులు పుడితే, నీకు సుఖముండదు, నీ కొడుకులు అల్పాయుష్షుతో చనిపోతారని చెపు తాడు. అయినా ఫాతిమా కొడుకూనే కనాలని కోరుకుంటుంది. చేసేది లేక శంరుడు ఫాతిమా కు సన్యోగర్బమేర్పడుతుంది అసేన్‌, ఉసేన్‌ కొడు కులు పుడతారు. వారిక పురుడు, నామాకరణం సాక్షాత్తు పార్వతీదేవి స్వయంగా జరుపుతుంది. పెరిగి పెద్దాయింతార్వాత ఇద్దరన్నదమ్ములు యుద్ద  విద్యలన్ని నేర్చుకుంటారు. శత్రుతురకలపైకి యుద్దానికి వెళ్తామని ఆశీర్వదించమని తల్లిని వేడు కొంటారు. ఆమె పాలివారు దుర్మార్గులు యుద్దా నికి వెళ్లోద్దని బతిమాలుతుంది. అయినా వారిద్దరు తల్లి మాటను వినరు. తట్టెడు పత్తిని ఒకే ఏకుగా పడకాలనీ, ఆపేస్తే మాకు చావు వస్తుందని ఆమె కు ఆజ్ఞాపించి వెళ్లిపోతారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులనుండి మొండి తురకలు, కక్ష తురకలు తురకలు ఇద్దరన్నదమ్ములను ముట్ట డిస్తారు. వారిద్దరు యుద్దం చేస్తు తప్పించుకోని, తల్లి దగ్గరకు వస్తారు. తల్లి ఏకు వడుకుతుంది. కొడుకులు తురకలోస్తున్నారు తలుపు తీయమం టారు. నా ఏకు కొంచమే ఉంది పూర్తి చేసి తలు పు తీస్తాను. మీ మాట ప్రకారం ఏకు పూర్తికాకుం టే మీరిద్దరు చచ్చిపోతారు. కొంచెం సేపు ఓపిక పట్టండి అంటుంది. ఇంతలో శత్రువుల కలకలం వినిపిస్తుంది. అన్నదమ్ములిద్దరూ పక్కనే ఉన్న బా విలో దాక్కుంటారు. శత్రు తురకలు బీబీఫాతిమా ఇంటి తలుపులు పగలగోట్టి ఇంటి లోపలికి వెల్లి చూస్తారు.అక్కడ వారు కన్పించరు. ఇంటి చుట్టుప క్కల చూస్తుండగా బావి గట్టుపై ఉన్న తోండ బావి లో దాక్కున్నారని సైగ చేస్తుంది. వేంటనే శత్రువు లు బావిలోకి ఆసేన్‌, ఊసేన్‌లను వెలుపలకి తీసు కోని వచ్చి చంపేస్తారు. ఇద్దరికీ గోరి కడ్తారు. వారు 41 రోజు గోరిలో ఉండి ‘రూపులు పటమా ర్చి’ శంభుదేవుని గుడిలోకి వస్తారు.వందనాలు చేస్తారు. శంకరుడెందుకు వచ్చారు, ఏమి సమా చారమని అడుగుతాడు.మరణించిన హుసేన్‌, హసేన్‌ను త్రేతాయగంలో లవకుశలుగా జన్మిం చారని వర్ణించి, తెలుగోల్ల, ముస్లింల మధ్యన ఏక త్వాన్ని సాధించారు. మత సహనాన్ని ప్రదర్శించా రు. ఆసేన్‌, ఊసేన్‌ కథనే కాకుండ, నవ వరుడు ఖాసీం మరణాన్ని కూడా యుద్దంలో చనిపోయిన వీరులను తలచుకోని కన్నీరు కారుస్తారు. పీర్ల ఊ రేగింపులోనూ, అగ్నిగుండం తొక్కేటప్పుడూ ,చు ట్టూరా తిరిగేటప్పుడూ పీర్లను శుబ్రపరచి తీసు కోని వచ్చేటప్పుడు పాటలను పాడుతుంటారు. పండగ సందర్భంలోనే కాకుండా మోట కోట్టే ప్పుడు, కోతలు కోసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు కూడా మొహర్రం గీతాలను గానం చేస్తుంటారు. మతం వేరైన, భాష వేరైనా, తెలుగోల్లు ముస్లింలు మొహర్రం ను తమదిగా చేసుకోని ఏడాదికోకసారి అత్యుత్సాహంగా జరుపుకుంటారు.

ఈనాటి రాజకీయాలు, మతతత్వ శక్తులు తెలుగోల్ల, ముస్లింల మధ్య భేదాలను సృష్టిస్తున్నా రెండింటి మధ్య దూరాన్ని పెంచుతున్నా, మొహ ర్రం పండగ మాత్రం తెలుగోల్ల ముస్లింల సమైక్య వేదికకు ఇరువురి మధ్యన సాన్నిహిత్యాన్ని పెంచు  తున్నాది.                                                                             -రావి ప్రేమలత

తెలుగు కథలో ముస్లింల జీవితాలు-భాష ముస్లిం జీవితాల గురించి తెలుగు కథలు రాసే ముస్లిం క థా రచయితల సమస్య విభిన్నమైంది. తెలుగు ముస్లింలుఇంట్లోఊర్దూ మాట్లాడతారు బయటి ప్రపంచంలో తెలుగు మాట్లాడతారు.ఆధ్రా ముస్లిం లు ఇంట్లో మాట్లాడుకునే భాషలో తెలుగు పదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. తెలంగాణ ము స్లింల ఊర్దూ పాలిష్‌డ్‌గా ఉంటుంది. వారి తెలు గులో ఉర్దూ పదాలు ఎక్కువగా ఉంటాయి.తెలుగు కథల పాఠకులు ఎక్కువగా తెలుగు వచ్చినవారు. ముస్లింలు కానివారు. తెలంగాణలో కూడా హైద రాబాదు ముస్లింల ఊర్దూ దక్కనిలో ఉంటుంది. తెలంగాణ గ్రామీణ ముస్లింల భాష కూడ అంత పాలిష్‌డ్‌గా ఉండదు. తెలుగు ముస్లింల భాషలో ఇన్ని వైరుద్యాలు ఉన్నాయి. కనుక తెలుగు ము స్లిం రచయితలకు ఆ వైరుధ్యాల వలన కథనంలో రాసే భాష సమస్య తీవ్రమైంది.ప్రస్తుతం తెలుగు రచయితలలోనే ఈ మాండలికాల గురించి చర్య నడుస్తున్నది. ఎవరో పరిశోధన చేసి మన తెలుగు భాషలో 48 మాండలికాలు ఉన్నట్లు తేల్చారు. వారు ఈ ముస్లిం రచయితల మాండలిక సమస్య ను పరిశోదించి ఉండరు. అప్పుడు ఇంకో ఐదో, పదో పెరిగేవి.ముస్లిం జీవితాల కథలు రాస్తున్న వారు ఏ భాషలో రాయాలి అనే చర్చ జరిగితే బా గుంటుంది. నాలాంటి వారి సంశయాలు తోలగి ముస్లిం కథలు బలంగా వస్తాయి. తర్వాత తెలుగు కథ ఇంకా పరిపుష్టి అవుతుంది.ముస్లిం కథల పా త్రలు ముస్లిం పాత్రలై ఉంటాయి. ఆ పాత్రలు పె ౖన చెప్పినట్లు రకరకాల భాషలు మాట్లాడతాయి. హైదరాబాదు పాత్ర అయితే దక్కని ఉర్దూ, విజ యవాడ పాత్ర అయితే తెలుగు కలసిన ఉర్దూ. ఎందుకంటే మనకున్న పాత్రోచిత భాష రాయా లనే నియమం ప్రకారం. కాని రాసేవి తెలుగు క థలు కనుక తెలుగులో రాయాలి.తెలంగాణా వచ్చి న కొత్తలో నా ఉర్దూ విని అందరూ నవ్వేవారు. ఇప్పుడు ఇక్కడి ఉర్దూ అలవాటయింది. తెలంగాణ తెలు గు కూడా అలవాటయింది. నాకథల్లోని భాష ల్లో ఆంధ్ర ఉర్దూ, తెలంగాణ ఉర్దూ, ఆంధ్రా తెలు గు, తెలంగాణ తెలుగు ఉంటాయి. ఎంతో జాగ్ర త్తగా సమన్వయం చేసి రాయాల్సివస్తున్నది.                                                                                                                                                                                                          -రహమతుల్లా

-వేముల ఎల్లయ్య,స్కైబాబ                                         ఇంకావుంది…