తెలంగాణ ఇవ్వకపోతే విప్‌ను ధిక్కరిస్తం : యాష్కీ

హైదరాబాద్‌: తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను ధిక్కరిస్తమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేలా కేంద్రం,  అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలమంతా ఐక్యంగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు బాబు రాజ్యం, రాజన్న రాజ్యం వద్దు, తెలంగాణ రాష్ట్రం కావాలి’ అని పేర్కొన్నారు.