తెలంగాణ ఇస్తేనే నాకు అవార్డు నా పాటకు అవార్డు ఇస్తే తెలంగాణకు ఏం ఒరుగుతది ?

 తనదైన ధోరణిలో స్పందించిన గద్దర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి):

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన 2011 ,లనచిత్ర నంది అవార్డ్‌లకు సంబందించి జైబోలో తెలంగాణ సినిమాలో పోడుస్తున్న పోద్దుమీద నడుస్తున్న కాలమ పాటకి గాను ఉత్తమ గాయకునిగా ఎంపికైన ప్రజా గాయకుడు గద్దర్‌ భిన్నంగా స్పందించారు. తనకు సంబందించినంతవరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైనప్పుడే తనకు నిజంగా అవార్డ్‌ వచ్చినట్లు భివిస్తానని గద్దర్‌ అన్నారు. ఈ ప్రజా ఉద్యమ సారమే  పోడుస్తున్న పోద్దుమీద గీతమని, ఈ తెలంగాణ గీతాన్ని గుర్తించిన ప్రభుత్వమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రారంభించాలని గద్దరు అన్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైనప్పుడే తనకు నిజంగా అవార్డ్‌ వచ్చినట్లు భివిస్తాను అదే నా నిబందన నేను అవార్డ్‌ తీసుకుంటానా.? లేదా అనేది ఇప్పటికి అనవసరం అని ఆయన విలేకరులతో తెలిపారు.