తెలంగాణ ఇస్తే సంబరమే ఇవ్వకపోతే సమరం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణసపై కేంద్రం వెనక్కి తగ్గితే పోరాటం తప్పదని తెరాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరో నాలుగు రోజులు వేచి చూస్తామని, 2009 లాగే తెలంగాణపై కేంద్రం వెనక్కి మళ్లితే పోరాటం తప్పదని ఆయన అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోను తెలంగాణపై వివక్ష కినసాగుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు. 73 శాతం ఉద్యోగాలు సీమాంధ్రులకే కల్పించారన్నారు. ఈ దఫా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా తెలంగాణ వ్యక్తిని నియమించాలని గవర్నర్‌, ముఖ్యమంత్రులను ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ వస్తే తెలంగాణ సీడ్స్‌ పేరుతో విత్తనాల ఉత్పత్తిని ప్రారంభించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్వడితే వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చుతామని చెప్పారు.