తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్లలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. విజయమ్మ పర్యటనతో తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.