‘తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడాల్సింది ప్రభుత్వమే’

నల్గొండ: తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సురవరం సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణ జర్నిలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విడిపోవడం ద్వారా ఐక్యంగా ఉండాలనే భావన సీమాంధ్ర నేతలు ప్రజల్లో కల్పించాలన్నారు. వెన్నెముకలేని నాయకులు దేశాన్ని పాలిస్తున్నారు. కవాతులో హింస చెలరేగుతుందని ప్రకటన చేయటం బాధ్యతా రాహిత్యం ఈ నెల 30 లోపు తెలంగాణపై ప్రకటన వస్తుందన్న ఆశలేదని సురవరం అన్నారు.