ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటీ?
` అలా అయితే అసలు దోషులెవరు?
` కాంగ్రెస్, బీఆరఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి
` కేసీఆర్, కేటీఆర్ నా ఛాలెంజ్‌కు సిద్ధమా?
` కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్
హైదరాబాద్(జనంసాక్షి): కేటీఆర్, హరీశ్‌రావు సహా అందరినీ సాక్షులుగా పిలిస్తే… అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటన్నారు. సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేసినట్లేనని.. ఇప్పటికైనా సిట్‌కు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుందన్నారు. కేటీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదని, ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్ నా ఛాలెంజ్ కు సిద్ధమా? అని సవాల్ విసిరారు. దేవుడి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతోపాటు బీఆరఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను చేర్చింది నిజం కాదా? అన్నారు. ఆఖరికి కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా?అని నిలదీశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో విÖడియా ప్రతినిధులతో బండి సంజయ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆరఎస్ కలిసి దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గతంలో కేసీఆర్ కుటుంబమే దోచుకుంటే…కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారన్నారని విమర్శించారు. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆరఎస్ లేఖ రాస్తే… బీఆరఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా? అని ఉప ముఖ్యమంత్రి భట్టి చెబుతున్నారని…సింగరేణిలో రెండు పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే… గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ గనుల దోపిడీ ఇప్పుడు కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సింగరేణిని దోచుకుంది ఆయన కుటుంబమేనని.. ఆ సంస్థలో దోచుకున్న సొమ్ముతోనే బీఆరఎస్ పార్టీని ఇన్నాళ్లు నడిపించారని పేర్కొన్నారు. రూ.42వేల కోట్ల సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుని సింగరేణిని అప్పుల పాల్జేసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారు.. అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మంతా దారి మళ్లించడం పరిపాటైందన్నారు. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును చూసి అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆరఎస్ రెండూ తోడు దొంగలేనని…మా భాగోతం విÖరు బయటపెడితే… విÖ భాగోతం మేం బయటపెడతామంటూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.



