తెలంగాణ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి

` పెద్దమందడికి సాగునీటి కోసం లిఫ్ట్‌ పనులు
` వనపర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి బ్యూరో నవంబర్‌26 (జనంసాక్షి):తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి రైతులను ఆదుకోవాలని వనపర్తి బిఅరెస్‌ పార్టీ అభ్యర్థి మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. పెద్ద మందడి మండలం కేంద్రంలో శనివారం రాత్రి రోడ్డు షో కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్ర శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. మంచి నీరు, సాగు నీళ్లు, కరెంట్‌, సంక్షేమ పథకాలు, రైతుంగానికి ఎదురు పెట్టుబడులు ఇస్తున్నాం. ఒక్క గుంట భూమి లేకుండా వ్యవసాయం చేస్తున్నారని,నాలుగు నెలలుగా  ఒక్క చుక్క నీరు లేకపోయినా సాగునీరు పుష్కలంగా నీళ్లు ఉండడం వాళ్ల ధ్యానపు రాశులు పండుతున్నాయన్నారు.పెద్దమందడి కి సాగునీళ్లు ఇబ్బంది కాకుండా లిఫ్ట్‌ పనులు చేపడుతామన్నారు.1.38 లక్షల ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ల చేతిలో ఉండి 5 ఎకరాల లోపు ఉన్నవారికి బ్యాంక్‌ 2లక్షలు ఋణం ఇవ్వనప్పుడు 2 లక్షల రుణమాపీ ఎలా చేస్తారని కాంగ్రెస్‌ వాళ్ల అబద్ద ప్రచారం చేస్తున్నారన్నారు.తెలంగాణ వ్యాప్తంగా యాసంగి, రబి సీజన్లో 1 కోటి 10 లక్షల ఎకరాల్లో వరి పండుతుంది.,రేషన్‌ బియ్యం కోసం ఎదురు చాచిన చేతులు నేడు దేశం మొత్తానికి బియ్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. బ్యాంక్‌ వాళ్లు అప్పులు కట్టక పోయిన సందర్బంలో రైతును ఇబ్బందులు పెట్టింది గత ప్రభుత్వం.. నేడు రైతుకు ఎదురు వచ్చి పెట్టుబడి ఇచ్చి వ్యవసాయంను అభివృద్ధి చేసింది  తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు .కాంగ్రెస్‌ పాలిత  రాష్ట్రములో రైతు బందు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్‌  వంటివి అక్కడ అమలు చేసి అక్కడి రైతులను అదు కోవాలన్నారు. ఎన్నికల ప్రచారం లో పూలతో ఘన స్వాగతం పలికిన ప్రజలందరికి శిరస్సు వంచి ధన్యవాదములు తెలిపారు.మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్ర శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రములో లెవెనెత్తిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసి అందరి కండ్ల ముందు పెట్టారని,ప్రజానీకానికి మంచి చేసే నాయకుడు మంత్రి నిరంజన్‌ రెడ్డి అని అన్నారు.5 రోజుల సమయాన్ని నిరంజన్‌ రెడ్డి కోసం పని చేద్దాం 5 సంవత్సరాలు మన కోసం పని చేస్తారన్నారు.గ్యాస్‌ సీలిండర్‌ 400 లకు ఇస్తాము అని చెప్పారు దేశం లో ఏ ప్రభుత్వం చెప్పలేదు ఇవ్వలేదు  ఇచ్చేదే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే, అన్ని మండలలో కారు పరుగులు తీస్తుంది మంత్రి నిరంజన్‌ రెడ్డి మల్లీ గెలుస్తారు మంత్రి అవ్వడం ఖాయమన్నారు. పెద్ద మందడి మండలం కేంద్రం లో 30 మంది కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.