తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ రథసారధి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలంగాణలోని క్రైస్తవులకు క్రిస్మస్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవి సమానత్వం , సౌభ్రాతృత్యం, సహనం, శాంతి, ప్రేమ, కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని కేసీఆర్‌ తన క్రిస్మస్‌ సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ రావాలని క్రీస్తును కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు.