తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఈ నెల 30న తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన ‘ తెలంగాణ మార్చ్‌’కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు తెలిపింది. మార్చ్‌కు మద్దతుగా శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలంగాణ తెదేపా ఫోరం నేతలు తెలియజేశారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖను రాజకీయ లభ్థి కోసమే వక్రీకరిస్తున్నారని వారు మండిపడ్డారు. కేసీఆర్‌ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్‌ వ్యక్తం చేయడంలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆజాద్‌, వయలార్‌ రవి చేసిన వ్యాఖ్యాలపై కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదో తెలపాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.