తెలంగాణ మార్చ్‌కు 2రోజుల ముందుగానే సమైక్యశాంతి ప్రజా చైతన్య యాత్ర

విశాఖ: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల కుట్రలను తిప్పికొట్టేందుకు శాంతి యాత్రలు చేపట్టనున్నట్లు ‘సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి’ విశాఖలో తెలిపింది. తెలంగాణ మార్చ్‌కు 2రోజుల ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యశాంతి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు ప్రజా పోరాట సమితి వెల్లడించింది. నిమజ్జనాల రోజున కొందరు రాజకీయ నాయకులు తెలంగాణ మార్చ్‌పేరుతో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సమితి కన్వీనర్‌ నారాయణరావు అన్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.