తెలుగు తల్లి మనసు పులకించే విధంగా సభలు :చిరంజీవి

తిరుపతి : తెలుగుతల్లి మనసు పులకించేవిధంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం అభినందనీయమని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుసభల  నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదనం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదన్నారు. ఈ సభలను ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలుగుభాషాభివృద్దికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌గా తెలుగును వర్ణించడం మన భాష గోప్పతనాన్ని తెలుపుతుందన్నారు. పరభాషలను నేర్చుకోవంలో తప్పులేదని ఆయితే తెలుగును మర్చిపోకూడదన్నారు.