తెలుగు భాషను కాపాడుకోవాలి:మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌:మరుగున పడుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి అన్నారు.అంతర్జాతీయ తెలుగు కేంద్రం ముద్రించిన తెలుగుభారతి 1నుంచి 5వ తరగతి తెలుగువాచకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.ఇతర రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ ఉన్న తెలుగు వారి సౌలభ్యం కోసం పలు పుస్తకాలను ముద్రించడం అబినందనీయమని చక్రపాణి అన్నారు.