తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆగ్రహం

వరంగల్‌: వరంగల్‌లోని విశ్వేశ్వర సాంస్కృతాంధ్ర కళాశాలలో తెలుగుభాషోధ్యమ సమాఖ్య కేంద్ర కార్యనిర్వాహక మండలి అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వానికి ప్రపంచ తెలుగు మహసభలు నిర్వహించే నైతిక హక్కులేదని తెలుగుభాషోద్యమ సమాఖ్య కేంద్ర కార్యనిర్వాహక మండలి తీర్మనించింది. తెలుగుభాష మహసభలను నిర్వహిస్తామని ఆంగ్లంలో జీవో వెలువరించడాన్ని సమాఖ్యప్రతినిధులు మండిపడ్డారు. ఈసమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సమాఖ్యశాఖ బాధ్యులు హజరయ్యారు. తిరుపతిలో ప్రభుత్వం నిర్వహించ తల పెట్టిన ప్రపంచ తెలుగు మహసభలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్‌బాబు వెల్లడించారు.