తొలి టెస్ట్‌లో ఆసీస్‌ గ్రాండ్‌ విక్టరీ సిరీస్‌లో 1-0 ఆధిక్యం

¬బార్ట్‌, డిసెంబర్‌ 18: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో ఆస్టేల్రియా ఘనవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. విజయం కోసం లంక 328 పరుగులు చేయాల్సిన దశలో చివరిరోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డ్రా కోసం లంక చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. 2 వికెట్లకు 65 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టును సంగక్కరా , సమరవీరా ఆదుకున్నారు. మహేళా జయవర్థనే ఔటైనా…. వీరిద్దరూ ఆసీస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ నడిపించారు. ఈ క్రమంలో సంగక్కరా హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేసుకోవడంతో పాటు సమరవీరాతో కలిసి నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. అయితే 63 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ దగ్గర సిడెల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటవడంతో లంక పతనం ప్రారంభమైంది. తర్వాత సమరవీరా , మాథ్యూస్‌ ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో డ్రాపై ఆశలు కలిగాయి. ఈ దశలో పీటర్‌ సిడెల్‌ మరోసారి ఆసీస్‌కు బ్రేక్‌ త్రూ ఇచ్చాడు. వరుసగా సమరవీరా 49 , మాథ్యూస్‌ 19 లను ఔట్‌ చేసాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో ప్రసన్న జయవర్థనే పోరాడినా… టెయిలెండర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.  జయవర్థనే 21 పరుగులకు ఔటయ్యాక… లంక  ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరికి మరో 12 ఓవర్లు మిగిలుండగా శ్రీలంక 255 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో మిఛెల్‌ స్టార్క్‌ 5 , పీటర్‌ సిడెల్‌ 4 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆస్టేల్రియా మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి తొమ్మిది వికెట్లు తీసుకున్న సిడిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ లభించింది. సిరీస్‌లో రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 26 బాక్సింగ్‌ డే రోజున మెల్‌బోర్న్‌లో ప్రారంభమవుతుంది.

స్కోర్‌ వివరాలు ః

ఆస్టేల్రియా తొలి ఇన్నింగ్స్‌ – 450/5 డిక్లేర్డ్‌

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌      – 336 ఆలౌట్‌

ఆస్టేల్రియా రెండో ఇన్నింగ్స్‌- 278 ఆలౌట్‌

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌     – 255 ఆలౌట్‌