థాయ్‌లాండ్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

బ్యాంకాక్‌:థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు ఆ దేశ పోలీసు అదికారులు ప్రకటించారు.పర్యాటకులకు ప్రసిద్ది చెందిన బ్యాంకాక్‌నుంచి టూరిస్టులతో ఒక బస్సు కో సమయ్‌ అనే రిసార్టుకు బయల్దేరింది.దారిలో బస్సు టైరు పెలిపోవడంతో అదుపు తప్పి వెళ్లి విద్యుత్‌ స్తంబాన్ని ఢీకొంది. ప్రబాదంలో పదిమంది మరణించగా వారిలో ఇద్దరు భారతీయులున్నట్లు సమాచారం మరో 17మంది గాయపడ్డారు.