దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు  మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను జగదల్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు.