దళితులకు న్యాయం జరగడం లేదు

హైదరాబాద్‌: ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారం కేసుల్లో చాలావరకు బాధితులకు న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.రామస్వామి అన్నారు. సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం రచించిన ‘ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు పోలీసు కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి’ అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఎస్సీ ఎస్టీ నిధుల మళ్లింపు అనే మరో పుస్తకాన్ని మాజీ ఏఐఎన్‌ అధికారి పీఎన్‌ కృష్ణన్‌ ఆవిష్కరించారు.