దళితులపై దాడి అమానుషం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : పెత్తందార్ల భూదాహానికి నలుగురు దళితులు బలయ్యారని, 20 మందికి పైగా గాయలు, ఇల్లు ఆస్తులు ధ్వం సంపై కేవీపీఎస్‌ నాయకులు గణేష్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రక టనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజాం గ్రా మానికి చెందిన దళితులపై అగ్రవర్ణాలకు చెం దిన నాయకులు దళితులను అన్యాయంగా దాడి చేయడం అమానుషం అన్నారు. భూసమస్యను పరిక్షరించడంలో విఫలమైందని దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభు త్వం వెంటనే చనిపోయిన దళితులకు రూ.10 లక్షల రూపాయలను అందించాలన్నారు. అంతేకాకుండా నిందుతులను వెంటనే అరెస్టు చేసి కేసులు పెట్టాలన్నారు. ఆగ్రామంలో చాలా కాలంగా భూవివాదం కొనసాగుతున్నప్పటికి ప్ర భుత్వ యంత్రాంగం సమస్యను పరిక్షరించాల్సిం ది పోయి దళితుల ప్రాణాలను తీసుకున ేవరకు చోద్యం చూస్తున్న అధికారులను సస్పెండ్‌ చేయా లని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఇప్పటికైనా సమ స్యను సత్వరమే పరిష్కరించాలని సంఘం నాయ కులు గణేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో బాల్‌సింగ్‌, సత్యం, రాణాప్రతాప్‌ తద తరులు పాల్గొన్నారు.