దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ చరిత్రాత్మక విజయం

42 స్థానాల్లో గెలుపు.. 25 చోట్ల ఆధిక్యం
దిల్లీ జ‌నంసాక్షి : దిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చరిత్రాత్మక విజయం దిశగా ఆప్‌ దూసుకెఏ్పు్తంది. ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్‌, భాజపాలను ఆ పార్టీ మట్టికరిపించింది. ఆమ్‌ ఆద్మీ దెబ్బకు భాజపా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ ఇంత వరకూ ఖాతా తెరవలేదు. మొత్తం 70 స్థానాలకు గాను ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆప్‌ 42 స్థానాల్లో విజయం సాధించి.. మరో 25 చోట్ల ముందంజలో ఉంది. భాజపా మూడు స్థానాల్లో విజయం సాధించింది.