దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.కోటి

విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు శనివారం జరిగింది. 18రోజుల్లో 32హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించగా కోటి 26వేల 675లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రఘునాథ్‌ తెలిపారు. నగదుతో పాటు భక్తులు 351గ్రాముల బంగారం, 2,653 కిలోల వెండి ఆభరణాలను కానుకలుగా సమర్పించినట్లు ఈవో తెలిపారు.