దూసుకుపోతున్న ‘ లైఫ్ ఆఫ్ పై’
లాన్‌ఏంజిల్స్: భారతీయత నేపథ్యంలో తెరకెక్కిన ‘ లైఫ్ ఆఫ్’పై చిత్రం ఆస్కార్ అవార్డుల రేసులో దూసుకుపోతోంది. మొత్తం 11 విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. మరిన్ని విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నో అంచనాలతో ముందుకు వచ్చిన లింకన్ చిత్రం ఇంకా ఖాతా తెరవలేదు.