దేనికైనారెడీ దర్శక, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) :
కలెక్టరరేట్‌ : దేనికైనా రెడీ సినిమా దర్శక, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలని జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం హైమావతి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేనికైనా రెడీ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయన్నారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరచే విధంగా సినిమా తీసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకురాళ్లు నాగరాణి, రత్నజ్యోతి, అంజలి, ఉమారాణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.