దేవుడి మాన్యాన్ని కాపాడేందుకే ఆందోళన చేశాను

హైదరాబాద్‌: దేవుడి మాన్యాన్ని కాపాడేందుకు శ్రీలక్ష్మి నరసింహ ఆలయం వద్ద ఆందోళన చేశానని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. ఆలయంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అనంతరం నిన్న జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. పోలీసులు అతిగా ప్రవర్తించారని, ఇలాంటి కేసులు తనకు కొత్తేమికాదని అన్నారు. దేవాలయానికి తాళం వేయడాన్ని సమర్దించుకున్నట్టు మంత్రి తెలిపారు. ఆలయం వద్ద శాంతి భద్రతలసమస్య ఉందని హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు దానం తెలిపారు.