*దేవుడు వరమందిస్తే మరుజన్మనైనా ఉంటే మళ్లీ గురుకుల లోనే చదవాలనిపిస్తుంది*
*బుద్ధారం గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడల ప్రారంభోత్సవంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (25):* మండల పరిధిలోని బుద్ధారం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఎనిమిదవ జోనల్ స్థాయి క్రీడలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు వరమందిస్తే మరుజన్మైనా ఉంటే ఏం కావాలని అడిగితే నాకు తిరిగి గురుకుల పాఠశాలలో చదువుకోవాలని ఉందని చెబుతానని అన్నారు విద్యార్థులకు చదువుకు మించిన సాధనం ప్రపంచంలో మరొకటి లేదని చదువు విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు విద్యార్థులు జ్ఞానం అర్థించడానికి విద్య ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుందన్నారు దీనిని నిరూపించిన భారతీయుడు విశ్వ మానవుడు అయినా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అననుకుల పరిస్థితుల్లో ఏ వస్తువులు లేని సమయంలో బాల్యం నుంచి విద్య పూర్తయ్య వరకు అనేక కష్టాలు పడి బరోడా మహారాజు యొక్క సహాయంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులను అభ్యసించి ప్రపంచంలో అతి కొద్ది మంది సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మేధావులలో అంబేద్కర్ ఒకరుగా నిలిచారన్నారు. అంబేద్కర్ విశ్వ మానవుడు కావడానికి చదువే ప్రధాన కారణం అన్నారు చదువు అంటే పరిశీలన చదువు అంటే అర్థం చేసుకోవడం చదువు అంటే వినడం చదువు అంటే ఆలోచించడం అని మంత్రి అన్నారు కాబట్టి నిత్యం ఏది మాట్లాడినా ఏది విన్న ఎవరితో సంభాషించిన మీ మనసు మెదడు విషయాన్ని సానుకూల దృక్పథంతో అర్థవంతం చేసుకునే తపనతో విద్యార్థులు ఉండాలన్నారు చదువుకునే సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోవద్దని విద్యా నేర్చుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవుతారని మీరు చదివిన చదువుకు ఒక ఆస్కారం ఏర్పడుతుందన్నారు ఈ జోనల్ స్థాయి క్రీడలలో పాల్గొనేందుకు వనపర్తి, నాగర్ కర్నూల్ ,జోగులాంబ గద్వాల్, జిల్లాలకు చెందిన 11 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలియజేశారు ఆటల్లో గెలవడం ముఖ్యం కాదు గెలవడమే ముఖ్యం కాదు ఆటలలో పాల్గొనడం అన్నిటికన్నా ముఖ్యమని అందరూ ఒకే చోట ఉండటం వల్ల మీ అనుభవాలు స్నేహాన్ని కొనసాగించి ఒకరి నుండి ఒకరు కొత్త అంశాలను నేర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి విద్యార్థులు ఎదగాలన్నారు. గురుకుల పాఠశాలలకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని త్వరలో సాంఘిక సంక్షేమ పాఠశాలలకు నూతన భవనాలను నిర్మిస్తామని ఆయన తెలిపారు వనపర్తి జిల్లాలో అన్ని రకాల విద్యను అభ్యసించడానికి అవసరమైన కళాశాలలో నిర్మించడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మంత్రి తెలిపారు విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల డాన్సులు , బతుకమ్మ , ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మంత్రి విద్యార్థులకు బతుకమ్మ, దసరా, పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ క్రీడలు ఆడటం ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విద్యార్థినిలు క్రీడల తోపాటు చదువులో రాణించాలన్నారు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ జోనల్ స్థాయి క్రీడలకు వనపర్తి జిల్లా వేదిక కావడం ఎంతో గర్వకారణం అన్నారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా క్రీడలతోపాటు చదువులో కూడా ముందుండాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య జెడ్పిటిసి మంద భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యులు మతిన్, బుద్ధారం సర్పంచ్ పద్మమ్మ, గోపాల్ పేట్ సర్పంచ్ శ్రీనివాసులు తహసిల్దార్ సునీత, ఎంపీడీవో హుస్సేనప్ప, గురుకుల పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోదండం, మండల నాయకులు కోటేశ్వర్ రెడ్డి, తిరుపతయ్య యాదవ్, కాశీనాథ్, బిల్లా కంటి రాజు, శ్రీనివాసులు, కాశీనాథ్, నాగరాజు, రవి మీడియా సెల్ కన్వీనర్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
4 Attachments • Scanned by Gmail
|