దేశంలో తగ్గుముఖం పడుతునన కరోనా
18వేలకు దిగువన కేసుల సంఖ్య నమోదు
న్యూఢల్లీి,అక్టోబర్16(జనంసాక్షి ): దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. అయితే క్రితం సారితో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇలా 8వేల దిగువన కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 17,861 మంది కరోనా నుంచి కోలుకోగా, 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,40,53,573 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2,01,632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ? 3,33,99,961. కొవిడ్ మరణాల సంఖ్య 4,51,980 కు చేరింది. కేరళలో నిన్న ఒక్కరోజే కొత్తగా 8,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. గత 24 గంటల్లో 8,36,118 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 97,23,77,045 మందికి వ్యాక్సిన్ వేశారు.
““““