దేశభక్తికి ప్రతిరూపం సర్దార్ భగత్ సింగ్..
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.దేశభక్తికి ప్రతిరూపం సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను అన్నారు.నేరేడుచర్ల మండల కేంద్రంలో ఏఐవైఎఫ్. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సర్దార్ భగత్ సింగ్ 115 వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.భారత స్వాతంత్ర సమరయోధుడు భరతమాత బానిస సంకెళ్ళను విడిపించేందుకు బ్రిటీషర్ల ఉరికొయ్యలకు 21 సంవత్సరాల చిన్న వయస్సులో నూనూగు మీసాల ప్రాయంలో ఊపిరి వదిలిన భారత యువకిశోరాల ఆశాజ్యోతి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్ అని ఆయన అన్నారు.క్షమాభిక్ష కోరితే వదిలి వేస్తామన్న నాటి బ్రిటిష్ పాలకులను..తు చ్చమైన ప్రాణాల కోసం బ్రిటిష్ వారి ముందు మోకరిల్లే సమస్యేలేదని ఖరాఖండిగా చెప్పి అమూల్యమైన తన ప్రాణాలను దేశం కోసం బలిదానం చేశాడని నేటితరం యువత భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు లను ఆదర్శంగా తీసుకోవాలని,భారతదేశం నేడు అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నదని 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రజలు అనేక త్యాగాలు చేసి ఈ దేశం కోసం భావితరాల కోసం నిర్మించుకున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ అధానీలకు అమ్మి వేస్తున్నారని సంవత్సరానికి రెండు కోట్ల ఇస్తామని ప్రగల్బాలు పలికిన మోడీ నేడు కోట్లాదిమందిని,నిరుద్యోగులుగా రోడ్లపాలు చేశాడని నేటి యువత మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి యల్లా బోయిన సింహాద్రి, పట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, ఏఐటియుసి మండలాధ్యక్షుడు ఊదర వెంకన్న, రేఖ ఉపేందర్,రాంప్రసాద్, సాంబయ్య,కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు