పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 7 (జనం సాక్షి): పోచంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుండు మధు, 13వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతకింది శ్వేత కిరణ్‌లకు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పోచంపల్లి మున్సిపాలిటీ కో-ఆర్డినేటర్లు డా. నంద్యాల దయాకర్ రెడ్డి, డా.తుంగ బాలు పాల్గొని ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో పోచంపల్లి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, ఆ అభివృద్ధి ఫలితంగానే ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు, అమలుకాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు, యువత చూపుతున్న ఆదరణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ విజయలక్ష్మి శ్రీనివాస్, సుమన్, శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్, రాజు, కిరణ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.



