దేశాభివృద్థిలో మహిళా సాధికారత కీలకం : సూకీ

అనంతపురం: భారతదేశ అభివృద్థిలో మహిళాసాధికారత కీలకమని మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ అన్నారు. అనంతపురం జిల్లా పాపసానిపల్లెలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు చక్కగా ఉపయోగపడుతోందని కొనియాడారు. తాను ప్రజాస్వామ్య పరిరక్షణకు సలహా  దారును మాత్రమేనని తెలియజేశారు. అనంతపురం ప్రజల ప్రేమాభిమానాలను తన వెంట తీపుకెళ్తున్నాని చెప్పారు.