దొడ్డిదారిన అంతర్‌ జిల్లా బదిలీలు తగదు

హైదరాబాద్‌:దొడ్డిదారిన అంతర్‌ జిల్లా బదిలీలను జరుగుతుండటం వల్ల ఉపాధ్యాయ సంఘూలు అభ్యందరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.విద్యాశాఖ ఎలాంటి షెడ్యూలు ప్రకటించకుండానే అంతర్‌ జిల్లా బదిలీలను చేపట్టడం వల్ల బదిలీల స్ఫూర్తి దెబ్బతింటోందని పైరవీకారులు లబ్దిపొందుతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.అంతర్‌ జిల్లా బదిలీల కోసం విద్యాశాఖకు విజ్ఞప్తులు అందాయి.వీటిల్లో ప్రజాప్రతినిదుల సిఫార్సులతో వచ్చినవే అధికం ఈ సిఫార్సులను అనుసరించి జారీ అవుతున్న ఉత్తర్వులు ఎక్కువవుతున్నాయని ఉపాద్యాయ సంఘూలు పీఆర్‌ టీయా,డీటీఎఫ్‌ పెర్కొంటున్నాయి దొడ్డిదారి బదిలీలను అడుకోకుంటే ఉద్యమిస్తామని ప్రొగ్రెసివ్‌ రిక్నగైజ్‌ టీచర్స్‌ యూనియన్‌ బుధవారం రమిక్కడ ఒక ప్రకటనలో హచ్చరించింది.అంతర్‌ జిల్లా బదిలీల కోసం ప్రత్యుకంగా షెడ్యూలును ప్రకటించాలని కోరినా పట్టించుకోని ప్రభుత్వం అంతర్గతంగా ఉత్తర్వులు జారీచేస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.దీనివల్ల అర్హులైన ఉపాధ్యాయలకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తంచేసింది.