దొడ్డి దారిన మరో విపత్తు

మనల్ని నిస్సహాయంగా పక్కకు నెట్టి మన జీవితాలను వినాశంనం వైపు తీసుకుపోతున్న విపత్తుల్లో ప్రకృతి బీభత్సాలు మాత్రమే కాదు వీపరీతరూపం తీసుకున్న6 పెట్టుబడి దాహం కూడా ముఖ్యమైనది. ప్రపంచ వాణిజ్య సంస్థను దీని ప్రధాన సాధనంగా చాలా కాలంగా భావిస్తూ వస్తున్నాముగానీ దానిని దాటిపోయేవి మన ప్రభుత్వం దాదాపు 30 దేశాల్లో చేసుకున్న, చేసుకుంటున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) వీటి ఫలితాలు మన మీద వచ్చి పడకుముందే వీటీ గురించి కొంచెమైనా తెలసుకొని వ్యతిరేకించడం అవసరం. ప్రకృతి బీభత్సం మనల్ని నిస్సహాయుల్ని చేస్తుంది కదూ? బాధితులు ఏడుస్తుంటే దిక్కుతోచక విలవిల లాడుతుంటే చూస్తుండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత చాలా బాధకరమైనది. అయితే ప్రకృతి పాలెంత ఉందో మానవ స్వయంకృతం పాలూ అంత ఉంది. గేట్లు సకాలం లో ఎత్తారా, షట్టర్లు సకాలంలో మూశారా, వగైరా మలే కాదు. మానవ నాగరికత ప్రకృతితో ఆడు కుంటున్న ఆట ప్రాణాంతకమైనదనడానికి మనకు లభిస్తున్న అనేక సూచికల్లో ఇటువంటి అకాల విపత్తులను లెక్కపెట్టక తప్పని రోజులొచ్చాయి. మనల్ని నిస్సహాయంగా పక్కకు నెట్టి మన జీవితాలను వినాశనం వైపు తీసుకుపోతున్న విపత్తులింకా ఉన్నాయి. దీనిని వర్తమాన కాలపుగుణంగా ప్రకటించవచ్చునెమో. నిజానికి ఇంకా ఉన్నాయి. అంటున్నాం గానీ అంతిమంగా అన్నిటి మూలమూ ఒకటే. అది విపరీత రూపం తీసుకున్న పెట్టుబడి దాహం. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటీఓ)ను దీని ప్రధాన సాధనంగా చాలా కాలంగా భావిస్తూ వస్తున్నాంగానీ దానిని దాటిపోయే మన ప్రభుత్వం దాదాపు 30 దేశాల తో చేసుకున్న చేసుకుంటున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) వీటి ఫలితాలు మన మీద వచ్చి పడకముందే వీటి గురించి కొంచెమైనా తెలుసుకొని ప్రపంచీ కరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనల్లో వీటిని వ్యతిరేకించే కార్యక్రమాన్ని చేర్చితే విపత్తును కొంతైనా వెనక్కి నెట్టగలుగుతామేమో. సంస్కరణ, సరళం, స్వేచ్చ మొదలైనవి మామూలుగా మంచి భావం గల మాటాలు. వినాశనాన్ని అందంగా అలకంరించే కార్పొరేట్‌ పెట్టుబడి తత్వం వీటిని చెడ్డ మాటలు చేసింది. అందుకే ఆర్థిక సంస్కర ణులు, సరళీకరణ, స్వేచ్చా, వాణిజ్యం మన భాష లో భయం గొలిపే మాటాలయ్యాయి. స్వేచ్చా, వాణిజ్యాన్ని అన్ని రంగాల్లోకి యథేచ్చగా విస్తరించి లాభాలు పోగుచేసుకునే స్వేచ్చా ఉండ డం అని ఈపాటికి అందరకీ బోధపడి ఉండాలి. ఆ వాణిజ్యం వాడకపు వస్తువులు నురచి పెట్టుబడి రంగానికి, సేవారంగానికి మానవ మేథో ఉత్ప త్లుకూ విస్తరించడంతో గాట్‌ పోయి డబ్ల్యుటీఓ వచ్చిందని కూడా ఈ పాటికి చాలా మందికి తెలిసి ఉండాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ లక్ష్యం ఏమిటంటే పెట్టబడిగల వాడికి వస్తువులను అమ్ముకునే విషయంలోనే కాదు బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌, విద్యా రంగాల్లో సైతం ఎల్లలు ఎరుగని వ్యాపార స్వేచ్చా ఉండాలి. దాని కోసం ఎక్కడికైనా పోయి పెట్టు బడులు పెట్టే స్వేచ్చ ఉండాలి, మళ్లీ తాను చేసే సాంకేతిక ఆవిష్కరణలతో వ్యాపారం చేసుకునే స్వేచ్చ మాత్రం తనకొక్కడికే ఉండాలి. అటువంటి ప్రపంచాన్ని సాధించడం దాని లక్ష్యం. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ గాట్‌కు వారసురాలిగా పుట్టడం వల్ల అది బహుళ దేశాల ఉమ్మడిగా వేదికగా ఉండక తప్పలేదు. అందులో పెద్దదేశాల పెత్తనం స్పష్టంగానే ఉన్పప్పటికీ వెనెక బడిన దేశాలు అప్పుడప్పుడు గుంపు కట్టి తమ ప్రయోజనాలను కాపాడుకోగలిగాయి. పెట్టుబడికి అంత స్వేచ్చ ఇస్తే చిన్న వృత్తులూ వ్యాపారాలూ వ్యవసాయమో చేసుకొని బతికే ప్రజలు తట్టుకొలేరన్న ఆందోళన ఈ దేశాల ప్రభుత్వాలను నిజంగా ఎంతగా కదిలించిందో చెప్పలేంగానీ, ఆ తట్టుకోలేని పరిస్థితి తమ పాలనను అభధ్రం చేస్తుందన్న ఆందోళన వారిని నిస్సందేహంగా కదిలించి ఉంటుంది. అందువల్ల ఉరేగ్వే రౌండ్‌తో మొదలైన 15 సంవత్సరాల కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తన లక్ష్యాన్ని చాలా మేరకు సాధించిందిగానీ పూర్తిగా సాధించలేకపోయింది. పెట్టబడికి ఎల్లలె రుగని స్వేచ్చ ఇవ్వడానికి వెనుకబడిన దేశాలూ పూర్తిగా సిద్దంగా లేవు. ఎక్కువ భాగం ఇచ్చాయి. కొంత నిరాకరిస్తున్నాయి. సేవారంగంలో స్వేచ్చా విఫణని ఆవిష్కరించడానికి కూడా అదే రకంగా సంశయిస్తున్నాయి. వ్యవసాయరంగానికీ ఆరోగ్యా నికి సంబంధించినంత వరకు పేటేంట్‌ హక్కులు పూర్తిగా ఇవ్వడానికి తటాపటాయిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంల్లో గుంపుగా వ్యవహారించి కొన్ని మినహాయింపులు సాధించు కున్నాయి. ఈ దేశాల ప్రజల ప్రయోజనాలను లెక్కించినప్పుడు ఈ సంశయాలూ తటాపటాయిం పులూ మినహాయింపులూ చిన్నవే అయినప్పటికీ, 1980ల మధ్య భాగం నుంచి మాంధ్యం దిశగా నడుస్తున్న అంతర్జాతీయ పెట్టుబడికి ఈ పరిస్థితి సంతృప్థినివ్వలేదు. ఫలితంగా దాని దృష్టి ద్వైపాక్షిక స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు వైపు మళ్లింది. ద్వైపాక్షిక ఒప్పందాల్లో బలవంతులు బలహీను లను దబాయించి తమ అవసరాలు సాధించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. బలహీన దేశం కూడా ఇదేదో ఒక దేశంతో చేసుకుంటున్న చిన్న ఒప్పందం లెమ్మని తన ప్రజలను బుకాయించగలుగుతుంది. ఈ ఒప్పం దాలను ఒకదానికొకటి కలిసి పూర్తి స్థాయిలో స్వేచ్చా విపణిని ఆవిష్కరించే దాకా ప్రజలకు ఏం జరుగుతున్నదీ తెలియదు. ఇటువంటి ఒప్పందాల కు కొంతకాలంగా మన పాలకులూ ఒడిగడుతు న్నారు. వీటి గురించి పార్లమెంటులో గానీ ఏ ప్రాతినిధ్య వ్యవస్థలోని గానీ చర్చ జరగదు. అసలు ఏం చేస్తున్నది అంతా అయిపోయేదాక తెలీదు. 2007 నుంచి ఈ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ప్రయోగాల జరుగుతుండగా, కొంతమంది పట్టుదల గల విమర్శుకులు తమ శక్తి యుక్తులన్నీ వినియోగించి ఈ మధ్య కాలంలోనే ఈ ఒప్పం దాలు స్వరూపాన్ని బయట పెట్టగలుగుతున్నారు. భారత్‌ 30 ఒప్పందాలు చేసుకుంటున్నదని చెప్పు కున్నాం. అందులో అన్నిటి కంటే ఎక్కువ దుష్ప్ర బావం వేయగలిగింది. యూరోపియన్‌ యూని యన్‌ (ఈయూ)తో చేసుకుంటున్న ఒప్పందం. ఈ ఒప్పందం ఇంకా తుదిరూపం తీసుకోలేదు గానీ, ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో భారత్‌ వ్యతిరేకించిన అనేక విషయాలు ఈ ఒప్పందాంలో ఉన్నాయనేది స్పష్టం అవుతున్నది. వ్యవసాయ పేటేంట్ల విషయంలో, ప్రపంచ వాణిజ్య సంస్థను కొంత మేరకు రాజీకి ఒప్పించి భారత్‌ చేసిన చట్టం ప్రకారం, ఒక కంపెనీ పేటెంట్‌ తీసుకొని ఉత్పత్తి చేసిన విత్తనాన్ని కొనుక్కున్న రైతు దానితో పంట పండించుకోవడమే కాక విత్తనం మిగిలిం చుకోవచ్చు. మళ్లీ పంట పెట్టుకోవచ్చు, ఇరుగు పొరుగుతో ఆ విత్తనాన్ని పంచుకోవచ్చు. అమ్ముకోవడానికి మాత్రం వీలులేదు. ఇప్పుడు ఈయూతో చేసుకుంటున్న ఒప్పందం ప్రకారం రైతు విత్తనాన్ని మిగుల్చుకొని మళ్లీ విత్తడానికి కూడా కంపెనీ అనుమతి తీసుకోవాలి. అప్పుడు కూడా తన పొలంలో మాత్రమే విత్తాలి. పక్క వారికి అరువియ్యడానికి వీలులేదు. దీని ప్రకారం వాణిజ్య రంగంలో దిగుమతి సుంకాలు సహితం భారత్‌ ఇంకా భారీగా తగ్గించవలసి ఉంటుంది. 1990 నాటికి దిగుమతి సుంకాలు సగటున 78 శాతం ఉండేవ, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒత్తిడి మేరకు 2005 నాటికి 17 శాతం పడిపోయాయి. ఈయూతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా దిగుమతి సుంకాలు శూన్యాన్ని చేరుకోవలసి వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థళో ఏరంగాన్ని వారు వదులుకోదలచుకోలేదు. మన దేశంలో ప్రభుత్వం తన పాలనా బాద్యతల నిమిత్తం కొన్ని కొనుగాళ్లు చేస్తుంది. టెండర్‌ ద్వారా కొన్ని పనులు చేయి స్తుంది. లెవీ ధాన్యం సేకరణ లెవీ సిమెంటు సేక రణ, రోడ్లు, బ్రిడ్జిలు వగైరా నిర్మించడం మొదలై నవి, ఈ కోవకు చెందినవి, ఇది దేశ జాతీయా దాయంలో 13 శాతం ఉంటుందని అంచానా. ఈ రంగంలో కూడా విదేశీ కంపెనీలకెఉ చోటివ్వాలని అంటే ఉదాహరణకు రోడ్డు పనులు కల్వర్టు, పనులు వీదేశీ కంపెనీలు చేపట్టే అవకా శం ఇవ్వాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రతిపా దన వచ్చినపుడు ఇండియా వంటి దేశాలు గట్టిగా వ్యతిరేకించాయిగానీ ఈయూతో ఒప్పందంలో అది ఉంది. చిల్లర వ్యాపారం (రిటైల్‌ మార్కెట్‌) మరొకటి. భారత్‌ ఆర్థిక రంగంలో ఇదొక పెద్ద వ్యవస్థ దేశంలోని మొత్తం ఆర్థిక సంస్థల్లో 85 శాతం ఇవేననీ అందులో దాదాపు 9 కోట్ల మంది పనిచేస్తారనీ అయిదవ ఆర్థిక సెన్సన్‌ లెక్కలు తెలుపుతున్నాయి. ఈ రిటైల్‌ మార్కెట్‌ వ్యవస్థ తలపులు విదేశీ పెట్టబడికి తెరవాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో వచ్చిన ప్రతిపాదనను భారత్‌ వంటి బడుగు దేశాలు వ్యతిరేకించాయి. కానీ ఈ యూతో భారత్‌ చేసుకుంటున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో ఇది సహితం ఉంది. ఆరోగ్యం విషయమూ అంతే మందులకు పూర్తి స్థాయిలో పేటేంట్‌ హక్కులు ఉండాలని ప్రపంచ వాణిజ్య సంస్థ అంటుండగా, భారత్‌ వంటి దేశాలు ప్రజారోగ్యానికి సంబంధించినంతవరకు కొంత మినహాయింపు పొందాయి. ఇప్పుడు భారత్‌ ఈయూతో చేసుకుంటున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో ఇదిలేదు. ఇది మందుల ధరలు విపరీతంగా పెరగగలవనడానికి సూచి. ఈ ఒప్పందాలు చేసుకుంటున్నది 30 దేశాలతోనే కదా అనుకోవద్దు. ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవస్థాపక నియమాలల్లో ఒకటేమిటంటే ఒక సభ్య దేశం ఇతర దేశాల మధ్య వివక్ష పాటించడానికి వీలులేదు. అంటే ఒకరికి ఇచ్చిన వాణిజ్య స్వేచ్చ ఇంకొకరికి నిరాకరించడానికి వీలులేదు. దీనికి భారత్‌ ఏ మినహాయింపూ కోరలేదు. కాబట్టి జరుగుతున్నదేమిటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల్లో తిరస్కరిస్తున్నట్టు కనిపించిన వినాశకరమైనా సూత్రాలను ద్వైపాక్షిక స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు రూపంతో భారత్‌ తిరిగి తెచ్చుకోవడం.              కె. బాలగోపాల్‌.