బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): బీసీ బిల్లులకు భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘’బీసీల కోసం గతంలో కేసీఆర్‌ అనేక పోరాటాలు చేశారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారు. తెలంగాణ మొట్టమొదటి స్పీకర్‌గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని, శాసన మండలి తొలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్‌ను నియమించాం. అడ్వకేట్‌ జనరల్‌గానూ బలహీనవర్గానికి చెందిన బీఎస్‌ ప్రసాద్‌ను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నియమించింది. కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌ (డీఎస్‌), బండా ప్రకాశ్‌, లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు నామినేట్‌ చేశాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.