ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్లవైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ వెళ్తున్న ఇంద్ర బస్సు వెనకనుంచి ఢికొంది. ఈ దుర్ఘటనలో అమ్మమ్మ, మనవడు అక్కడికక్కడే మృతిచెందారు. బండి నడుపుతున్న వ్యక్తి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు.