ధర్మానను నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు : కే కేశవరావు

హైదరాబాద్‌: ‘మంత్రి ధర్మాన ప్రసాదరావును నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. ‘ ధర్మాన తప్పు చేశాడు?లేదా? అని నిర్ణయించాల్సింది కోర్టు మాత్రమే, మంత్రి వర్గం కాదు ‘ అని అన్నారు. ధర్మానను విచారణకు అనుమతించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఇవాళ గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. ధర్మాన విచారణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన లేఖలో తప్పపట్టారు. ధర్మాన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. సీఎం అయితే ఆయన విషయాన్ని మంత్రివర్గానికి నివేదించడం విచిత్రంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధర్మానకు మంత్రి వర్గం క్లీన్‌చిట్‌ ఇవ్వడం, సీబీఐ, న్యాయస్థానాలపై అపోహలు సృష్టించడమేనని కేకే ఆందళన వ్యక్తం చేశారు.