ధర్మాన వ్యవహారరపై సొంత నిర్ణయాన్ని కేబినెట్‌కు రద్దారు: డీఎల్‌

హైదరాబాద్‌: ధర్మాన వ్యవహారంపై సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌కు రుద్దారని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుస్తున్న ధర్మాన కేసులో రాష్ట్ర మంత్రివర్గం ఎలా జోక్యంచేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ నిర్ణయం మీదే అన్నీ అంశాలు ఆధారపడివున్నాయని, ఆయన నిర్ణయం కోసం వేచిచూస్తానని డీఎల్‌ పేర్కొన్నారు.