ధాన్యంపై కాంగ్రెస్‌, బిజెపిల రాద్ధాంతం

share on facebook

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలన్నీ అబద్దాలు మంత్రి హరీష్‌ ఘాటు విమర్శలు

సంగారెడ్డి,నవంబర్‌30(జనం సాక్షి):  ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్దాలేని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.నారాయణఖేడ్‌లో మంత్రి విూడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో కొనుగోళ్లు కేంద్రాలెన్ని, టీఆర్‌ఎస్‌ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్నో లెక్క తేల్చుకుందామా అని సవాల్‌ విసిరారు. సంగారెడ్డి జిల్లాలో 70 శాతం పంట కొనుగోలు పూర్తి చేశాం. ఇంకా 30 శాతం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోళ్లు కేంద్రలు ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.బీజేపీ, కాంగ్రెస్‌కు కొనుగోలు పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌ వైఖరి ఒకలా.. కిషన్‌ రెడ్డి మాటలు మరోలా ఉంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఒక లెటర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తీరుతో తడిసిన వడ్లు కొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని అన్నారు.  నారాయణఖేడ్‌కు తాగు, సాగు నీటి ఇవ్వాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 70 ఏండ్లు అధికారం ఉన్న కాంగ్రెస్‌ తాగునీరు, సాగు నీరు అందిచలేదని విమర్శించారు. సింగూర్‌ ప్రాజెక్టు ద్వారా లిప్ట్‌ పెట్టి సంగారెడ్డి జిల్లాకు నీరు అందిస్తా మన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల విూద గా పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Other News

Comments are closed.