నందివనపర్తిలో రజకుల కులదైవం ఈదమ్మ గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ సర్పంచ్ రాజునాయక్

share on facebook
యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో రజకుల కుల దైవం ఈదమ్మ గుడి పునర్నిర్మాన పనులను  , రాజునాయక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రాజునాయక్ మాట్లాడుతూ తన సొంత నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయాలు మానసిక వికాస కేంద్రాలని, దైవభక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు కులపెద్దలు మాట్లాడుతూ తన సొంత నిధులతో ఇంతటి ఆలయానికి శ్రీకారం చుట్టిన రాజునాయక్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి, కొండాపురం శ్రీశైలం,నిట్టి బీరప్ప మరియు రజక సంఘం కులపెద్దలు గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Other News

Comments are closed.