నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు
నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ వద్ద దేవరకొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 5గురు మృతి చెందగా, ఘటనా స్థలిలో నలుగురు మృతి చెందగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరి కొందరిని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. నల్గొండ జిల్లాలోని ఈరోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌, ఎస్పీలను సీఎం ఆదేశించారు.